రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శనివారం ఎన్యుమరేటర్లు చేపట్టిన సర్వేను దగ్గరుండి పర్యవేక్షించారు. సర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. సర్వే ఫారంలో వున్న ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించి వారు అందించే వివరాలను నమోదు చేయాలని సూచించారు. పొరపాట్లు జరగకుండా చూడాలని అన్నారు.