నారాయణపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి. వాడవాడన చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుని వేడుకలు జరుపుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్ సిబ్బంది ఎస్పీ యోగేష్ గౌతమ్ రంగులు వేసుకుంటూ హోలీ జరుపుకున్నారు. అనంతరం ఎస్పీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారిక నివాసం వద్దకు వెళ్లి కలెక్టర్ దంపతులకు రంగులు అంటించి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.