హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్కడ ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉంటాయన్నా విషయం తెలిసిందే. అయితే ఆ కొండల అంచుల్లో ఓ బస్సు డ్రైవర్ ప్రమాదకరంగా బస్సును నడుపుతున్నాడు. బస్సులో టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ బస్సు డ్రైవర్ల ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. మరికొందరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.