పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నారాయణపేట పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సిరెడ్డి కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.