రాష్ట్రంలో పేద, బలహీన వర్గాల పిల్లలు చదివే గురుకుల పాఠశాలలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష ఉన్నదని బీఎస్పీ బొదిగెలి శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గురుకుల పిల్లలకు కనీస వసతులు కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. విషాహారం, విష జ్వరాలతో, పాము కాట్లతో విద్యార్థులు బలవుతుంటే ప్రభుత్వానికి సోయి లేదన్నారు.