సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 21వ రోజు కొనసాగాయి. బుధవారం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెండు రోజుల క్రితం మంత్రులతో ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులలో చర్చలు జరిపి సమ్మె చేస్తున్న వారిని విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.