విప్లవ విద్యార్థి ఉద్యమంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ది ఘనమైన చరిత్ర అని పిడిఎస్యు ఉమ్మడి మహబూబ్ నగర్ మాజీ జిల్లా అధ్యక్షులు కాలేశ్వర్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రాము శుక్రవారం అన్నారు. పిడిఎస్యు ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో సిటిజన్ క్లబ్ నుండి ప్రధాన కూడళ్ళ మీదుగా ఎస్ఆర్ గార్డెన్ వరకు విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు.