బస్సు, బైక్ ఢీ.. యువకుడి మృతి
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన నవాబుపేట మండలం ఎన్మనగండ్ల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం. నవాబ్ పేట గ్రామానికి చెందిన యాదగిరి (23) ద్విచక్ర వాహనంపై మహబూబ్ నగర్ నుంచి నవాబ్ పేటకు వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.