విద్యుత్ ఘాతానికి 15 ఏళ్ల బాలుడు మృతి
నాగర్ కర్నూలు జిల్లా రాజాపూర్ మండలం రేకులపల్లి గ్రామం ఒప్పి తండాకు చెందిన శివమ్మ మనోహర్ ల కుమారుడు శివ (15) గ్రామపంచాయతీలో బల్బు పెడుతుండగా పక్కనే ఉన్న 11 కెవి వోల్టేజ్ విద్యుత్ వైర్ తెగి బాలుని పై పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాన్ని నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.