భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త, అందరికీ ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అబ్దుల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ గా పేరుగాంచిన గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని ఎమ్మెల్యే కొనియాడారు.