వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ షాప్స్ బంద్

79చూసినవారు
వనపర్తి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ షాప్స్ బంద్
వనపర్తి జిల్లా ఆత్మకూరు, మదనాపురం మండాలాల పరిధిలోని పిన్నంచర్ల గ్రామంలో 3 రోజుల్లోనే 450 కోళ్లకు పైగా మృతి చెందాయి. సమాచారం మేరకు జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం వైద్యాధికారులు కోళ్ల షెడ్డును పరిశీలించారు. కోళ్ల నుంచి నమూనాలను సేకరించారు. ల్యాబ్‌ నుంచి వచ్చే నివేదిక వచ్చిన తర్వాతే వ్యాధి నిర్ధారించే అవకాశం ఉందన్నారు. బర్డ్ ఫ్లూతో కోళ్లు మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్