బీసీ బాలుర వసతి గృహాన్ని మరో భవనంలో మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు భవనం కారడం విద్యార్థులు ఇబ్బందులు పడినందున కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. వర్షపు నీరు కుర్వకుండ తాత్కాలికంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.