వనపర్తి జిల్లా పరిధిలోని జూరాల జలాశయంలోకి వరద కొనసాగుతోంది. జలాశయంలోకి 31 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా. జలవిద్యుదుత్పత్తి ద్వారా 39 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు ఆదివారం జూరాల అధికారులు తెలిపారు. గేట్ల ద్వారా నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. జలాశయంలో నీటినిల్వ 8. 6 టీఎంసీల మేర ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 28 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా ప్రాజెక్టు దిగువకు 27 వేలు వదులుతున్నారు.