గోశాలలో భక్తులు ప్రత్యక్ష గోదానం

70చూసినవారు
వనపర్తి జిల్లా శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని విష్వక్సేన గోశాలలో భక్తులు ప్రత్యక్ష గోదానం చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు సౌమిత్రి రామాచార్యులు ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణ పఠనంతో అర్చకులు గో ప్రదక్షిణ చేసి గోవుకు మంగళహారతి సమర్పించారు. అనంతరం గోవు, దూడను కలిపి గోశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, మహిళలు, భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్