ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని, అవసరమైన మందుల్ని సీడీఎస్ నుంచి తెప్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం కొత్తకోట, మదనాపురం మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. ఈడిడి, ఒపీ రిజిస్టర్లు, ఐపీ, డెలివరీ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న గర్భిణులకు హిమోగ్లోబిన్ మెరుగుదల కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలన్నారు.