మిషన్ భగీరథ ట్యాంక్ పై వినాయక విగ్రహం

82చూసినవారు
మిషన్ భగీరథ ట్యాంక్ పై వినాయక విగ్రహం
గణపతి నవరాత్రుల సందర్భంగా వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఏకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ మధ్యలో సెంట్రింగ్ కట్టెల సహాయంతో మండపం ఏర్పాటు చేశారు. అంత ఎత్తులో ప్రతిష్టించిన గణనాథుడిని అటుగా వెళ్తూ పోయేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. నిర్వాహకుల వెరైటీ ఆలోచనకు ప్రజలు ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్