వాల్మీకులకు అండగా నేనుంటా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

56చూసినవారు
వాల్మీకులకు అండగా నేనుంటా: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎకో పార్కులో మార్నింగ్ వాకింగ్ లో శనివారం నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను వాల్మీకి రాష్ట్ర, జిల్లా నాయకులు కలిశారు. వాల్మీకుల ఎస్టీ జాబితా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా తీరని అన్యాయం చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మీ న్యాయమైన డిమాండ్ కొరకు నేను ప్రశ్నించే గొంతుకనై వాల్మీకులకు అండగా నేనుంటానన్నారు.

సంబంధిత పోస్ట్