వనపర్తి జిల్లా మర్రీకుంట శివారులో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ నెలలో విద్యార్థులు రాబోతున్నందున అక్టోబర్ 1 వరకు బాలికల వసతి గృహ భవనాన్ని సకల సౌకర్యాలతో పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.