వనపర్తి జిల్లాలోని నిరుద్యోగులకు 8 ప్రైవేటు కంపెనీలలో పని చేయడానికి ఈ నెల 19న గురువారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి మహమ్మద్ జానీ పాషా తెలిపారు. మొత్తం 1640 ఖాళీలు ఉన్నాయని, 18-30 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. ఆధార్ కార్డు, అర్హత సర్టిఫికెట్ లతో పీఎంకేకే సెంటర్, రామాలయం, సాయినగర్ కాలనీలో గురువారం హాజరు కావాలని సూచించారు.