వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం ఊకచెట్టు వాగులో బాట వివాదంతో మంగళవారం వందుకు పైగా ఇసుక ట్రాక్టర్లు నిలిచిపోయాయి. స్థానికులు వివరాలు. ఊకచెట్టు వాగులో ఇసుక తరలింపుకు ఆత్మకూరు ట్రాక్టర్ల వారు బాట వేసుకున్నారు. వైశాగాపూర్ టాక్టర్ల వాళ్లు అదే బాటను వాడుకునేందుకు ఆత్మకూరు వారు అడ్డు చెప్పారు. ఆత్మకూర్ ట్రాక్టర్లను తమ ఊరిమీద వెళ్లకుండా వైశాగాపూర్ వారు తమ శివారులో అడ్డుకున్నారు. దీంతో వందకు పైగా ట్రాక్టర్లు నిలిచిపోయాయి.