హైదరాబాద్ అమీర్ పేట్ లో అత్యాచారం కేసు వివరాలు బుధవారం పోలీసులు వెల్లడించారు. వనపర్తికి చెందిన యువతి ఎల్లారెడ్డిగూడలో తన అక్క ఇంటికి వచ్చింది. సమీపంలో ఉంటున్న సాయికృష్ణ యువతికి బంధువు కావడంతో చనువుగా ఉండేది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేరని, అన్నం వండిపోవాలని పిలిచి యువతిపై సాయి అత్యాచారం చేశాడు. వరుస కుదరక పెద్దలు పెళ్లికి నో చెప్పారు. ఫొటోలు వైరల్ చేస్తానని యువకుడు బెదిరించడంతో యువతి పీస్ లో ఫిర్యాదు చేసింది.