హైడ్రా ఇప్పటి వరకు ప్రైవేటు ల్యాండ్స్‌లో కూల్చివేతలు చేపట్టలేదు. ఎక్కడ కూలగొట్టిన చెరువులు, ప్రభుత్వ భూముల్లో కబ్జా చేసి కట్టిన వాటినే కూలగొట్టారు. దీంతో అక్కడ కబ్జా చేసి అమ్ముకున్న వాళ్లు పరారయ్యారు. కొనుకున్న వాళ్లు ఇరుక్కుపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం వారికి ఏమైనా న్యాయం చేస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కానీ.. కూల్చి వేతల్ని ప్రశ్నిస్తే కబ్జాల్ని సమర్థించినట్లే అవుతుంది.