వనపర్తి జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలకు అవసరం ఉన్న మౌలిక వసతులపై ప్రతిపాదనలు ఇవ్వాలని సూపర్వైజర్లను జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. బుధవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, సిడిపిఒలు, సుపర్వైజర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.