బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం వనపర్తి బిఆర్ఎస్ నేతలు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర సాధకులు, రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపిన కేసీఆర్ పై సీఎం వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యాంగ పదవిలో ఉండి శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎంపై చర్యలు తీసుకోవాలన్నారు.