కొద్దిపాటి వ్యాయామం, పరిమితమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటే మధుమేహం వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో మధుమేహ వ్యాధి పరీక్షలను చేయించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలో 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ మధుమేహ పరీక్షలు కొనసాగుతుందని, వ్యాధి బారిన పడిన వారికి చికిత్సలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.