వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం గణప సముద్రం రిజర్వాయర్లు భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ. 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు, సిపిఎం నేత జబ్బార్ డిమాండ్ చేశారు. శనివారం రిజర్వాయర్ పనులను పరిశీలించి మాట్లాడుతూ. సుమారు రూ. 48కోట్లతో రిజర్వాయర్ నిర్మిస్తున్నారని, 360మంది రైతులు 420ఎకరాలు కోల్పోతున్నారన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు బాల్ రెడ్డి, దేవేందర్ మహేశ్ పాల్గొన్నారు.