వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులో సీటు కోసం మహిళలు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన గురువారం చోటు చేసుకుంది. బస్సులో ఎక్కడానికి ప్రయత్నిస్తున్న మహిళ, మరో మహిళకు మధ్య సీటు కోసం గొడవ ఏర్పడింది. బస్సులో దుర్భాషలాడటంతో బస్సులోంచి దిగి ఒకరినొకరు పైపు, చీపురు కట్టలతో, జుట్టు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.