అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో చాలా చోట్ల ప్రచారం చేశానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 'తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామనుకున్నాం. ఏం జరిగిందో తెలియదు కానీ.. కొన్ని చోట్ల ఓడిపోయాం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. పట్నం మహేందర్రెడ్డి వెన్నుపోటు పొడిచారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట రంజిత్రెడ్డే ఫోన్ చేశాడు. చేవెళ్ల అభ్యర్థిగా నన్ను ప్రకటించు.. తప్పకుండా గెలుద్దామని అన్నాడు' అని వ్యాఖ్యానించారు.