సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వెకేషన్ కోసం ఫ్యామిలీతో ఇటలీకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ వెకేషన్ ముగించుకుని ఇటలీ నుంచి హైదరాబాద్ వచ్చారు. త్వరలోనే SSMB29 మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరో మహేష్ బాబు హైదరాబాద్ విమానాశ్రయంలో అభిమానులతో కలిసి ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ న్యూ లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.