మల్కాజ్‌గిరి MLA రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు. ప్రభుత్వ వైఫల్యాలు, డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారని చెప్పారు. 'ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 ఏళ్ళ ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది' అని పేర్కొన్నారు.