సీఎం రేవంత్ ను కలుస్తానన్న మల్లారెడ్డి

1067చూసినవారు
సీఎం రేవంత్ ను కలుస్తానన్న మల్లారెడ్డి
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంపై తాను త్వరలోనే సీఎం రేవంత్ ను కలుస్తానని అన్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిస్తే తప్పేంటన్నారు. గతంలో రేవంత్, తాను టీడీపీలో కలిసి పనిచేశామని గుర్తుచేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మల్కాజ్ గిరి ఎంపీగా తనకు పోటీ చేసే ఉద్దేశం లేదని.. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్