MPలో బిచ్చం అడిగినందుకు వ్యక్తి అరెస్ట్

50చూసినవారు
MPలో బిచ్చం అడిగినందుకు వ్యక్తి అరెస్ట్
భిక్షాటన చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ రాష్ట్రం ఇటీవల ‘భిక్షాటన నిరోధక చట్టం’ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భోపాల్‌లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిచ్చమెత్తుకుంటున్న యాచకుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. కాగా, బిచ్చం అడిగిన వ్యక్తిని అరెస్ట్ చేయడం దేశంలోనే ఇది తొలిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్