TG: మెరుగైన వైద్య సదుపాయాలున్నా, అక్షరాస్యత పెరిగినా, జననీ సురక్ష యోజనతో ప్రభుత్వం నిధులు అధికంగానే ఖర్చు చేస్తున్నా... రాష్ట్రంలో కాన్పులు జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్లలో నిరుడు జాతీయ సగటు 21.5% నమోదవగా... తెలంగాణ 60.7 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం, గర్భిణులు బలహీనంగా ఉండటం, ముహూర్తాలపై నమ్మకం పెరగడం కారణాలుగా తెలుస్తోంది.