భర్త అనుమానిస్తున్నాడనే ‘పాప’ను చంపేసింది!

83చూసినవారు
భర్త అనుమానిస్తున్నాడనే ‘పాప’ను చంపేసింది!
AP: విశాఖలో ఈ నెల 13న మంచంపై నిద్రిస్తున్న బిడ్డను తల్లి దిండుతో అదిమి చంపేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త వేధించడం వల్లే కన్నబిడ్డను చంపినట్లు తల్లి ఒప్పుకుంది. పెదగదిలి కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్న వెంకటరమణ, శిరీషకు 2013లో పెళ్లయింది. 5 నెలల క్రితం పాప పుట్టింది. అనుమానంతో నిత్యం భార్యను వేధించే వెంకటరమణ.. పాప పుట్టిన తర్వాత ఇంకా రెచ్చిపోయాడు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురై శిరీష బిడ్డను చంపేసింది.

సంబంధిత పోస్ట్