నడుము లోతు వరదలో తలపై బైక్ మోసుకెళ్లిన వ్యక్తి (వీడియో)

72చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ వరదలు రావడంతో ఓ యువకుడు తన బైక్‌ను కాపాడుకునేందుకు తలపై మోసుకెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బైక్‌పై వెళ్తున్న అతనికి బ్రిడ్జీ వద్దకు రాగానే వరద ప్రవాహం పెరిగింది. అప్పుడు టూ వీలర్ నడపడం వీలు లేకపోవడంతో బైకును తలపై పెట్టుకుని వెళ్ళాడు. దాదాపు 100 మీటర్ల వరకు నడుస్తూ వెళ్ళాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాహుబలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్