విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి

52చూసినవారు
విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయంలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన చోటు చేసుకుంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. అతడు ప్రమాదవశాత్తు పడ్డాడా.. లేక దూకి ఆత్మహత్య చేసుకొన్నాడా? అనేది తెలియాల్సుంది.

సంబంధిత పోస్ట్