అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఫ్లాట్లు

83చూసినవారు
అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న ఫ్లాట్లు
యూపీలోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నోయిడాలోని సెక్టార్ 110లో గల లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో ఓ భవనంలో ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్