Nov 21, 2024, 09:11 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
బెల్లంపల్లి మహమ్మద్ ఖాసీం బస్తీలో స్క్రాప్ దుకాణం తరలింపు
Nov 21, 2024, 09:11 IST
బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ కాసిం బస్తీలో ఏర్పాటు చేసిన స్క్రాప్ దుకాణాన్ని ఎట్టకేలకు గురువారం మున్సిపల్ అధికారులు తరలింపు ప్రక్రియను ప్రారంభించారు. స్క్రాప్ దుకాణంతో బస్తి వాసులతో పాటు పట్టణ ప్రజలు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ శాఖకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో స్పందించిన అధికారులు స్క్రాప్ దుకాణం సామాను తరలించే పనిలో నిమగ్నమయ్యారు.