ఖబర్దార్ రేవంత్.. KTR హెచ్చరిక

79చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మానుకోటలో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు కవాతు నిర్వహించారు. దీనిపై 'X' వేదికగా కేటీఆర్ మండిపడ్డారు. 'మానుకోటలో పోలీసుల లాంగ్ మార్చ్ ఏంటి? పోలీసుల హెచ్చరికలు ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన.. మొత్తంగా రాక్షస పాలన. ఖబర్దార్ రేవంత్' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్