బీహార్‌లో పట్టాలు తప్పిన దర్భంగా ఎక్స్‌ప్రెస్‌

84చూసినవారు
బీహార్‌లో పట్టాలు తప్పిన దర్భంగా ఎక్స్‌ప్రెస్‌
బీహార్‌లోని బెట్టియాలో బుధవారం అర్ధరాత్రి ఓ రైలు పట్టాలు తప్పింది. ఆనంద్‌ విహార్‌ నుంచి దర్భంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు బగాహ పోలీస్‌ జిల్లా హరినగర్‌ స్టేషన్‌ సమీపంలో పట్టాలు తప్పింది. రైలులోని రెండు బోగీలు, ఇంజిన్‌ ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న వారికి ఏం కాలేదు. గుర్తు తెలియని వ్యక్తులు వాక్యూమ్‌ బ్రేక్‌ వేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్