ఘనంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

562చూసినవారు
ఘనంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం
నెన్నెల మండలం గంగారంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టపన రెండవ రోజు శనివారం విగ్రహములకు పంచమ్రుత స్నానం, యంత్ర హోమము, మూల మంత్ర హోమము, దేవుళ్లను ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ సుధ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం ఆలయ సంస్కారం, 8 గంటలకు విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమం ఉంటుందని భక్తులు పాల్గొని దర్శించుకోవాలని తెలిపారు. భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్