గ్రామాల్లో తాగునీటి సరఫరా లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని బెల్లంపల్లి సబ్ డివిజన్ ఇంట్రా డిఈఈ ప్రవీణ్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి మండలం గురిజాల, దిగ్నెపల్లి గ్రామాల్లో మంగళవారం తాగునీటి సరఫరాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని నీటితో ట్యాంకులను, ట్యాంక్ పరిసరాలను పరిశీలించారు. ట్యాంకును పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.