ఉత్తమ రైతులుగా ఎంపికైన వారిని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కృషివిజ్ఞాన కేంద్రాల అధిపతి షేక్ ఎన్ మీరా శాలువా, మెమెంటో తో శనివారం ఘనంగా సన్మానించారు. కన్నేపల్లి మండలం పోలంపల్లికి చెందిన బండి మొగిలి, జజ్జరవెల్లికి చెందిన దుర్గం సుమన్, పొన్నారంకు చెందిన అశోక్, మర్క మహేష్, నాగేశ్వర్ లను ఘనంగా సత్కరించారు. ఉత్తమ రైతులను ఆదర్శంగా తీసుకోవాలని రైతులకు సూచించారు.