ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి వుంది పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ఫార్మసీ, ఆస్పత్రి ఆవరణ, రిజిస్టర్ లను పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై రోగులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.