నెన్నెల మండలంలోని గంగారం గ్రామానికి చెందిన యువ నాయకులు బెల్లంపల్లి యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జాడి రాజ్ కుమార్ బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకట స్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధి కి ప్రత్యేకంగా కృషి చేయాలని, పాటశాల ఆవరణలో ప్రహరీ, వాడల్లో రోడ్డుకు ఇరువైపుల నాళాలు నూతనంగా ఏర్పాటు చేసి గ్రామ పరిశుభ్రతకు తోడ్పాటును అందించాలని ఎమ్మెల్యే ను కోరినట్లు రాజ్ కుమార్ తెలిపారు.