కాసిపేట మండలంలోని కాసిపేట 1 ఇంక్లైన్ గనిలో శుక్రవారం దుర్గామాత వార్షికోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గని అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ దంపతులు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గని కార్మికులు, ఉద్యోగులకు దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన వేడుకున్నారు.