కాసిపేట మండలం దేవపూర్ గ్రామపంచాయతీ అచ్యుతారావు గూడెంకు చెందిన ఆత్రం సత్యవతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ చేయూతనందించారు. శుక్రవారం వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం నెలకు సరిపడా నిత్యవసర సరుకులు, బియ్యాన్ని వారికి అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.