నెన్నెల మండలం చిత్తాపూర్ గ్రామంలో శనివారం తాజా మాజీ సర్పంచ్ బత్తిని పద్మా వెంకటేష్ గౌడ్ చలివేంద్రంతో పాటు అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా మండుతున్న ఎండలకు పని చేస్తున్న ఉపాధి కూలీలకు, పాదచారులకు, ప్రయాణికులకు సౌకర్యార్థం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.