విస్తారంగా దోమల నివారణకు పొగ యంత్రాలు

80చూసినవారు
కన్నెపల్లి మండల కేంద్రంలో దోమల నివారణకు విస్తారంగా దోమల పొగ కొడుతున్నారు. విష జ్వరాలు ప్రబలుతున్న వేళ తక్షణ చర్యగా దోమల పొగ వాడ వాడ కొడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి తలుపులు కిటికీలు తెరిచి ఉంచాలని తెలియజేసి ఈ పొగ ముందు కొట్టడం ద్వారా దోమలు ఇతర కీటకాలు నశించి విష జ్వరాలు రాకుండా దోహదపడుతుందని పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొని వాడ వాడ పొగ మందు వెదజల్లారు.

సంబంధిత పోస్ట్