టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

78చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని పై శనివారం టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నాయకులు బడికల రమేష్, సిద్ధంశెట్టి సాజన్ ల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గని ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీజీకేఎస్ సంఘంతోనే కార్మికుల అన్ని హక్కులు సాధించబడ్డాయని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్